కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం దబాంగ్ 3. ప్రభుదేవా దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. 

మరో విశేషం ఏంటంటే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ దబాంగ్ 3లో విలన్ గా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉండబోతోంది. తాజాగా దబాంగ్ 3 ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, వినోదం అన్ని అంశాలు ఉన్నాయి. 

ఫ్లాష్ బ్యాక్ లో సల్మాన్ ఖాన్ యువకుడిగా నటించనుండడం ఆసక్తిని రేపుతోంది. యంగ్ చుల్ బుల్ పాండేకు ప్రేయసిగా సయీ మంజ్రేకర్ నటిస్తోంది. ఇక ఎప్పటిలాగే సోనాక్షి సిన్హా గ్లామర్ తో అదరగొట్టేసింది. ఇక సల్మాన్ సల్మాన్ ఖాన్ వినోదాన్ని అందిస్తూనే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. 

కొన్ని షాట్స్ లో సల్మాన్ పవర్ ఫుల్ లుక్ ఆసక్తిని రేపే విధంగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ లో సయీ మంజ్రేకర్ తో వచ్చే లవ్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నాయి. చుల్ బుల్ పాండే హంగామాని దబాంగ్ 3 ట్రైలర్ లో మీరు కూడా చూడండి.