బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడంలో ముందుటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కలెక్షన్స్ ని స్పీడ్ గా రికవర్ చేసేలా సల్మాన్ వేసే అడుగులు మాములుగా ఉండవు. ఇక ప్రస్తుతం దబాంగ్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న చుల్ బుల్ పాండే అదే తరహాలో మరో సినిమాను కూడా పూర్తి చేయాలని పొగరుతో సిద్దమయ్యాడు.

రాధే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈద్ కానుకగా ఆడియెన్స్ కి సినిమాని ఇస్తానని చెప్పిన సల్మాన్ పక్కా ప్లానింగ్ తో రెడీ అయ్యాడు. ఓ వైపు దబాంగ్ పనులు పూర్తవ్వకముందే రాధే షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. షూటింగ్ మొదటిరోజు సల్మాన్ ఎంట్రీకి సంబందించిన వీడియో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. స్టైలిష్ గా కాస్త పాజిటివ్ గా పొగరును యాడ్ చేస్తూ కనిపించడం చూస్తుంటే సినిమాలో సల్మాన్ పాత్ర కూడా అదే తరహాలో ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది.  

పొగరున్న పోలీస్ ఆఫీసర్ గా దబాంగ్ సిరీస్ లతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న కండల వీరుడు రాధే సినిమాతో ఎలాంటి కిక్ ఇస్తాడో అని ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ని చాలా వేగంగా ఫినిష్ చేయాలనీ సల్మాన్ ఫిక్స్ అయ్యాడు. ప్రభుదేవా - సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా వాంటెడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు దబాంగ్ 3 తో రెడీ అవుతున్నారు. అనంతరం 2020 ఈద్ కి రాధే సినిమాతో రావాలని ఫిక్స్ అయ్యారు.డిసెంబర్ లో దబాంగ్ 3 రిలీజ్ అనంతరం ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు. అంటే 5నెలల్లో సినిమాను పూర్తి చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నారు. అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఈద్ ని మిస్ చేసుకోకూడదని సల్మాన్ గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమాతో సల్మాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

read also:బాహుబలి - KGF సినిమాలపై సల్మాన్ కామెంట్!