బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ సినీ మార్కెట్ లో గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతున్నాడు. దబాంగ్ సినిమాను ఈ సారి సౌత్ భారీగా రిలీజ్ చేసేందుకు సిద్దమైన సల్మాన్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. డైరెక్ట్ గా ఆడియెన్స్ తో కూడా మాట్లాడడానికి సిద్దమైన ఈ హీరో ఇటీవల సౌత్ సినిమాలపై ఎనలేని ప్రేమ కురిపించాడు.

సల్మాన్ ఖాన్ దబాంగ్ 3క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ కాబోతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో కూడా ఒకేసారి విడుదల కానుంది. అయితే ఇటీవల చెన్నై లో తమిళ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సల్మాన్ అక్కడి స్టార్ హీరోలను ఒక రేంజ్ లో పొగిడాడు.

విజయ్ చేసిన పోకిరి సినిమాను చూసి బాలీవుడ్ లో రీమేక్ చేసినట్లు చెప్పిన సల్మాన్ రజిని కాంత్ విక్రమ్ - అజిత్ సినిమాలను రెగ్యులర్ గా చూస్తుంటానని చెప్పాడు.  ఇక బాలీవుడ్ సినిమాలకంటే కూడా దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా మంచి ఆధారన్న పొందుతున్నాయని బాహుబలి - కెజిఎఫ్ సినిమాలు అందుకు నిదర్శనమని అన్నారు.

ఆ రెండు సినిమాలను కూడా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పిన సల్మాన్ దబాంగ్ 3ని సౌత్ లో భారీగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. అదే విధంగా త్వరలో మరోసారి తమిళ్ ప్రేక్షకులతో డైరెక్ట్ మాట్లాడతానని స్వీట్ కిక్ ఇచ్చాడు.  ఇక ఇటీవల సల్మాన్ తెలుగు ఆడియెన్స్ ని పూర్తిగా తనవైపుకు తిప్పుకునేందుకు ప్రభుదేవాతో కలిసి సినిమాకు ప్రమోషన్స్ కూడా చేశాడు.

తెలుగు ఆడియెన్స్ తో డైరెక్ట్ గా చాట్ చేశాడు. ప్రభుదేవా అంటే తెలుగు ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. గతంలో అతను డైరెక్ట్ చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. అలాగే పౌర్ణమి సినిమా చేశాడు. నటుడిగా కూడా తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన దబాంగ్ 3 ని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు.

ఈగ విలన్ సుదీప్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించాడు. నార్త్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికె అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని మరింత పెంచలని సల్మాన్ ఖాన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి అతని ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.