బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భాయ్ సల్మాన్ ఖాన్ దబంగ్ 3 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజవ్వడం అందరిని ఆకర్షించింది. పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్న సల్మాన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. హిందీలో సినిమా కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నప్పటికీ దాక్షిణాదిలో మాత్రం అనుకున్నంతగా గుర్తింపు దక్కడం లేదు. దబాంగ్ 3 తెలుగు బయ్యర్స్ కి గట్టి దెబ్బె వేసేలా కనిపిస్తోంది. మంచి సమయంలోనే రిలీజ్ చేసినప్పటికీ తెలుగు ఆడియెన్స్ తమిళ్ హీరోలను పట్టించుకున్నంతగా హిందీ హీరోలను ఎక్కువగా పట్టించుకున్నది లేదు.

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

ఇక ఇప్పుడు ఎలాగైనా దబాంగ్ 3 సినిమాతో అన్ని భాషల్లో సక్సెస్ అందుకోవాలని చూసిన సల్మాన్ ఖాన్ సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సినిమా అన్ని భాషల్లో కలుపుకొని మొదటిరోజు 24.50కోట్లు వసూలు చేసింది. తమిళ్ - తెలుగు భాషల్లో ప్రెస్ మీట్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన సల్మాన్  తన స్థాయికి తగ్గట్టుగా కలెక్షన్స్ అందుకోలేకపోయారు.

హిందీలో అయితే క్రిస్మస్ వరకు కలెక్షన్స్ డోస్ తగ్గేలా కనిపించడం లేదు. వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. ఇలానే కొనసాగితే సల్మాన్ భాయ్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడం పక్కా.. మరి సల్మాన్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా - సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటించారు. ఇక విలన్ పాత్రలో కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించారు.