‘చిత్రలహరి’ సక్సెస్ సాయి ధరమ్‌తేజ్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఆ ఊపులో  ఇప్పుడు ఆయన  ‘ప్రతిరోజూ పండగే’ అనే టైటిల్‌తో  సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించనున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే కొన్ని కీలక సీన్స్ షూటింగ్ అమెరికాలో జరిగింది. ఈ నేపధ్యంలో చిత్రం కథేంటన్నది ఆసక్తికరంగా మారింది.

తిరుమల శ్రీవారి సేవలో దీపికా, రణవీర్ ల జంట!

దర్శకుడు మారుతి సినిమాల్లో సాధారణంగా .. హీరోకి ఏదో ఒక మానసిక సమస్య ఉండటం జరుగుతోంది. అది ఇగో కావచ్చు.., మతిమరుపు, అతి శుభ్రత .... ఇలాంటి సమస్యల చుట్టూ సినిమా కథలను అల్లి హిట్ కొడుతున్నాడు మారుతి. అదే పద్దతిలో ఈ సినిమాలో 'చావు' గురించి ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. త్వరలో  చచ్చిపోతామని బాధపడే కన్నా .... బతికినంత కాలం ప్రతిరోజు పండగలా బతకాలనే థీమ్ చుట్టూ కథని అల్లినట్లు సమాచారం. అయితే కథలో ఎవరు చనిపోబోతున్నారనేది కీలకమైన ట్విస్ట్.

‘‘హీరో సాయిని ఓ కొత్తరకమైన పాత్రలో, న్యూ లుక్‌లో చూస్తారు. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఉంటుందీ చిత్రం. రెండురెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా మారుతి తెరకెక్కిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన సాయితేజ్, సత్యరాజ్‌ ఉన్న లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అంటున్నారు నిర్మాతలు.  

 ‘సుప్రీమ్‌’ తర్వాత ధరమ్‌తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది.  మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.