ఆలయానికి చేరుకున్న ఈ జంటకి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తయిన తరువాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. 

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం నాడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్ జంట దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తయిన తరువాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు.

ఆ తరువాత స్వామివారి తీర్ధ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. దీపికా, రణవీర్ లు రేపు ఉదయం అమృత్ సర్ చేరుకొని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొన్ని ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట గత సంవత్సరం నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మరోవైపు ఇవాళ శ్రీవారిని ఏపీ ఉప సభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. 

View post on Instagram
View post on Instagram