మెగాహీరో సాయి ధరం తేజ్ కి ఆ మధ్య వరుసగా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. దీంతో దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన 'చిత్రలహరి' సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్.. మారుతి రూపొందిస్తోన్న 'ప్రతిరోజు పండగే' అనే సినిమాలో నటిస్తున్నాడు.

గీతాఆర్ట్స్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటని కూడా విడుదల చేశారు. డిసంబర్ 20న  సినిమాను  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సాయి ధరం తేజ్ గీతాఆర్ట్స్ విషయంలో సంతోషంగా లేడని సమాచారం.

చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. చరిత్రలో చూడని డెడ్లీ కాంబినేషన్స్!

దానికి కారణం తన సినిమా ప్రమోషన్స్ విషయాలను గీతాఆర్ట్స్ పెద్దగా పట్టించుకోవడం లేదట. బన్నీ నటిస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా పనుల్లో గీతాఆర్ట్స్ నిమగ్నమై ఉండడంతో 'ప్రతిరోజు పండగే' సినిమా ప్రమోషన్స్ లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం.

'అల వైకుంఠపురములో' సినిమా పాటలను ప్రమోట్ చేసినట్లు తన సినిమాలో పాటలు కూడా ప్రమోట్ చేస్తారని భావిస్తే అలా జరగకపోతుండడంతో సాయి ధరం తేజ్ ఈ విషయంపై కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో గీతాఆర్ట్స్ సంస్థ విషయాన్ని సీరియస్ గా తీసుకుందట.

ముందుగా 'ఓ బావ' అనే పాటను లిరికల్ వీడియో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమా పాటలను రిలీజ్ చేసిన మాదిరి సింగర్స్ తో ఓ వీడియో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై 'ప్రతిరోజు పండగే' సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.