మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి ఆలోచనలు, ఆచరణలు కాస్త భిన్నంగా ఉంటాయనే చెప్పాలి. నటిగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్కడ ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో సరైన అవకాశాలు రావడం లేదు.

తెలుగులో ప్రస్తుతం ఈ బ్యూటీ నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రానా సరసన 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

కోరికలు తీర్చమని అడిగేవారు.. లొంగలేదని.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

జీవితంలో ఏదైనా అనుకున్న విషయం జరగకపోతే.. నిరాశ పడడం సహజమని.. అయితే అలాంటి వాటిని తాను వేరే కోణంలో చూస్తానని చెప్పింది. ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని.. అంతేకానీ ఆశించింది జరగలేదని నిరుత్సాహపడకూడదని చెప్పింది. ఏం జరిగినా మన మంచికే అని భావించడం తనకు చదువుకునే రోజుల్లో నుండే అలవాటు అయిందని చెప్పింది.

ఇటీవల సాయి పల్లవికి ఓ ప్రకటనలో నటించడానికి ఏడాదికి కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా ఆమె నిరాకరించిందట. గతంలో కూడా ఆమెకి రూ.2 కోట్లు ఇస్తామని ఓ ఫేస్ క్రీమ్ సంస్థ ఆఫర్ చేసే దాన్ని కూడా రిజెక్ట్ చేసింది. యాడ్స్ విషయంలో సాయి పల్లవి ఎందుకో ఇంటరెస్ట్ చూపించడమ లేదు.

డబ్బు కోసం ఏది పడితే అది చేయనని గతంలో ఈమె వెల్లడించింది. ఎంత సంపాదించినా.. రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేసి మూడు చపాతీలే.. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ తింటామా..? అని ప్రశ్నించింది. సంతోషంగా, ఆత్మసంతృప్తితో జీవిస్తే చాలని చెప్పింది. విలువలు చంపుకొని పని చేయడం తనకు నచ్చదని.. అందుకే ఇటీవల కొన్ని యాడ్స్ రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది.