సాయి పల్లవి అద్భుతమైన నటి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు. ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా చిత్రంతో అందరి హృదయాలు దోచుకుంది. సాయి పల్లవి గ్లామర్ షోకు దూరంగా ఉన్నప్పటికీ యువతలో ఆమెకు క్రేజ్ పెరిగింది. అల్లరి పిల్లగా సాయి పల్లవి చేసే నటన అందరిని ఆకట్టుకుంది. 

ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యకు జోడిగా లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తోంది. సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రెండవసారి నటిస్తున్న చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతు, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని అభిమానులు అంటున్నారు. 

సాధారణంగా సాయి పల్లవి గ్లామర్ షో, రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటుంది. కానీ కథ పరంగా వచ్చే రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని సాయి పల్లవి అంటోంది. కొన్ని చిత్రాల్లో కథకు, రొమాన్స్ కు అసలు సంబంధం ఉండదు. అసలు హీరోయిన్ పాత్ర ఎందుకు ఉందో కూడా అర్థం కాదు. 

గంగూలీ బయోపిక్: నగ్మాతో ఎఫైర్ ఉంటుందా ?

అలాంటి చిత్రాల్లో నటించాలంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఎన్నో చిత్రాలు వదులుకున్నట్లు సాయి పల్లవి తెలిపింది. కథని, పాత్రని అర్థం చేసుకుంటే సంగం పని అయిపోయినట్లే. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ దానంతట అదే పండుతుంది. కానీ ప్రాధ్యానత లేని పత్రాలు పోషించి రొమాన్స్ చేయడం మాత్రం కష్టమే అని సాయి పల్లవి చెబుతోంది.