ధనుష్ స్టార్ డమ్ యువ శంకర్ రాజా మ్యూజిక్ ప్రభుదేవా కొరియోగ్రఫీ ఇవన్నీ ఒక ఎత్తైతే సాయి పల్లవి క్రేజ్ మరొక ఎత్తు. రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి దోహదపడ్డాయి. సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఒకే ఒక్క పాటతో పూర్తిగా అర్థమైపోయింది.

ధనుష్ తో చిందులేసిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికే 700 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది.  అత్యంత వేగంగా 700మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ఇండియన్ సాంగ్ గా రౌడీ బేబీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చూస్తుండగానే రోజురోజుకు పాటకు వ్యూస్ సంఖ్య పెరుగుతూ వస్తోంది.

also read టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

యువన్ శంకర్ రాజా అందించిన సంగీతానికి ప్రభుదేవా  కొరియోగ్రఫీ సూపర్బ్. సాయి పల్లవి - ధనుష్ కాంబినేషన్ లో ఎనర్జీ కరెక్ట్ గా  కనిపించడంతో అదే ఫ్లో లో సాంగ్ సంచలనం సృష్టించింది. ఇక బాలీవుడ్ సాంగ్స్ కి కూడా ఈ సాంగ్ ఎసరుపెట్టేలా ఉందని అర్ధమవుతోంది. బాలీవుడ్ లో టెన్ సాంగ్స్ మాత్రమే టాప్ లో ఉన్నాయి.

అయితే ఆ సాంగ్స్ రిలీజయ్యి ఏళ్ళు గడుస్తోంది.  ఇప్పుడు రౌడీ బేబీ ఆ సాంగ్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఫస్ట్ సౌత్ సాంగ్ గా చరిత్ర సృష్టించబోతోందని చెప్పవచ్చు. మరో 300 మిలియన్ల వ్యూవ్స్ వస్తే వరల్డ్ వైడ్ సాంగ్స్ లో సాయి పల్లవి సాంగ్ కూడా ఉంటుంది. మరి ఈ రికార్డ్ కి ఎంత సమయం పడుతుందో చూడాలి