తాజాగా ప్రతీ రోజు పండగే సినిమాతో పలకరించిన సాయి తేజ తన తదుపరి సినిమాకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. మార్చి 2020లో నెక్ట్స్ చిత్రం లాంచింగ్ జరగనుంది. లాంచింగ్ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దర్శకుడు మరెవరో కాదు...దేవకట్టా. ప్రస్తానం, ఆటోనగర్ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దేవకట్టా వరస ఫ్లాఫ్ లతో వెనకపడ్డాడు. అయితే హిందీలో సంజయ్ దత్ తో ప్రస్తానం రీమేక్ చేసి మళ్ళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.

బాలయ్య, బోయపాటి సినిమా క్యాన్సిల్ అవుతుందా..?

దానికి తోడు నెట్ ఫ్లిక్స్ కు బాహుబలి.. బిపోర్ ది బిగినింగ్ వెబ్ సీరిస్ చేస్తూండటంతో అంతా ఆసక్తిగా దేవకట్టా వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో సాయి తేజకు ఓ కథ చెప్పి ఒప్పించారు. భగవాన్,దానయ్య నిర్మించే ఈ చిత్రం ఇంటెన్స్ డ్రామాతో నిండి ఉంటుందని, సాయితేజ పాత్రను కొత్త డైమన్షన్ లో చెప్పే ప్రయత్నం చేసాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మిగతా ఆర్టిస్ట్ లు, టెక్నికల్ టీమ్ సైతం త్వరలో ఫైనల్ కానుంది.
 
ప్రస్తుతం తేజు...సోలో బ్రతుకే సో బెటర్...ఇది ఆ కొత్త సినిమా చేస్తున్నారు.  రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్.  శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుబ్బు అనే కొత్త డైరెక్టర్  పరిచయం అవుతున్నాడు.