ఈ ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్ బయోపిక్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమా దెబ్బకి దర్శకుడు క్రిష్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు బాలయ్య 'రూలర్' రూపంలో మరో ఫ్లాప్ సినిమా అందుకున్నాడు. రొటీన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బాలయ్య ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నాడు.

ఓపెనింగ్స్ రావడం కూడా కష్టంగా మారింది. అయినప్పటికీ బాలకృష్ణ తన పంథా మార్చుకోవడం లేదు. 'రూలర్' సినిమా దారుణంగా ఫెయిల్ అయిన నేపధ్యంలోబాలయ్య నెక్స్ట్ సినిమా ఉంటుందా లేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమా కోసం రూ.70 కోట్ల వరకు బడ్జెట్ అనుకుంటున్నారు.

టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేయాలంటే ఈ హీరోలే..!

బోయపాటి అంతకుమించి తగ్గడం లేదు. బాలయ్య మీద రూ.70 కోట్లు అనేసరికి మైత్రి లాంటి నిర్మాణ సంస్థలు ధైర్యం చేయలేకపోయాయి. దీంతో ప్రాజెక్ట్ కాస్త మిరియాల రవీందర్ దగ్గరకి వచ్చింది. బాలయ్య కూడా పది కోట్ల రెమ్యునరేషన్ కి తగ్గడం లేదు. ఇలాంటి నేపధ్యంలో బోయపాటి కాంబినేషన్ అన్నా మార్కెట్ అవుతుందా అనేది అనుమానం.

పైగా బోయపాటి ఆఖరి సినిమా 'వినయ విధేయ రామ' దారుణంగా ఫెయిల్ అవ్వడంతో అతడి కొత్త సినిమా బయ్యర్లు కొంటారా లేదా అనేది కూడా డౌటే. ఇలాంటి నేపధ్యంలో బోయపాటి, బాలయ్య సినిమా విషయంలో పునరాలోచనలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా క్యాన్సిల్ అవుతుందా..? లేక బోయపాటి బడ్జెట్ విషయంలో రాజీ పడతాడా..? ఇలా పలు సందేహాలు తలెత్తుతున్నాయి. మార్కెట్ లో బాలయ్య సినిమాకి ముప్పై కోట్ల మార్కెట్ కూడా లేదు. కాబట్టి బోయపాటి బడ్జెట్ ని కుదించి సినిమా చేస్తాడేమో చూడాలి!