Asianet News TeluguAsianet News Telugu

సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తాం: డిసీపీ, నరేష్ ఇంటి నుంచి వెళ్లడంపై ఆరా

హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తామని డీసీపీ చెప్పారు.

Sai Dharam Tej to be questioned by Madhapur police
Author
Hyderabad, First Published Sep 11, 2021, 1:35 PM IST

హైదరాబాద్: సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేష్ కుమారుడు నవీన్, సాయి ధరమ్ తేజ్, మరో వ్యక్తి ఒకే చోటికి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేష్ చెప్పిన విషయం తెలిసిందే. నరేష్ కుమారుడు నవీన్ ను కూడా పోలీసులు బైక్ రైడర్ గా గుర్తించారు.

బైక్ రైడింగ్ ఆధారంగా పోలీసుుల కేసును దర్యాప్తు చేస్తున్నారు. కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తామని డీసీపీ చెప్పారు. అవసరమైతే నటుడు నరేష్ ను, ఆయన కుమారుడు నవీన్ ను కూడా ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. బైక్ రైడింగ్ చేస్తే తీవ్రమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. 

Also Read: ఏరా హెల్మెట్ కొన్నావా.. సాయిధరమ్ తేజ్ ని పవన్ అడిగిన మొదటి ప్రశ్న

సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు నరేష్ స్పందించిన విషయం తెలిసిందే సాయి ధరమ్ తేజ్ తమ ఇంటి నుంచే బయలుదేరాడని ఆయన చెప్పారు. తన కుమారుడు నవీన్ కలిసి సాయి ధరమ్ తేజ్ బైక్ రైడింగ్ చేస్తుంటాడని ఆయన చెప్పారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలా సార్లు హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. తన కుమారుడిని, సాయి ధరమ్ తేజ్ ను హెచ్చరించిట్లు ఆయన చెప్పారు. 

తన బిడ్డలాంటివాడని ఆయన అన్నారు. త్వరగా కోలుకుని తిరిగి సినిమా షూటింగులో పాల్గొనాలని ఆయన ఆశించారు. తాను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు తన అమ్మ బైక్ మీద వెళ్లననని ఒట్టు వేయించుకుందని ఆయన చెప్పారు. బైక్ లు ముట్టుకోకుండా ఉండడం మంచిదని ఆయన అన్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని కోరుకోవాలని కోరుకుంటున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఏ సమస్య కూడా లేదని చెప్పారని శ్రీకాంత్ అన్నారు.

Also Read: త్వరగా కోలుకో బ్రదర్... ఎన్టీఆర్ ఎమోషనల్!

సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణిస్తూ కేబుల్ బ్రిడ్జి దాటిన వెంటనే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైనప్పుడు బైక్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ కు బైక్ రైడింగ్ చేయడం అలవాటు. 

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధమైన సమస్యలు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని అపోలో వైద్యులు చెప్పారు. అయితే, ఆయన ఇంకా స్పృహలోకి రానట్లు సమాచారం.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు శనివారంనాడు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అన్ని ప్రధాన అవయవాలు చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అపోలో ఆస్పత్రికి శనివారం ఉదయం హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన వచ్చారు. 

సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే శుక్రవారం సాయంత్రం చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, సందీప్ కిషన్, వైష్ణవ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కు ప్రాణాపాయం లేదని చిరంజీవి, అల్లు అరవింద్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios