ఓ సినిమా ట్రైలర్ రిలీజయ్యినా , ఓ పాట బయిటకు వచ్చినా దాని మూలాలు ఎక్కడున్నాయి. దేని నుంచైనా కాపీ కొట్టారా లేక ప్రేరణ పొందారా వంటి విషయాలపై రీసెర్చ్ మొదలెట్టేస్తూంటారు సోషల్ మీడియా జనం.  పొరపాటున దొరికారా ట్రోల్స్ తో ఆడేసుకుంటారు. తాజాగా సాయి తేజ హీరోగా రిలీజ్ కు రెడీ అవుతున్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసారు.

మారుతి దర్శకత్వం, ఫామ్ లో ఉన్న మెగా హీరో సినిమా కావటంతో వెంటనే వైరల్ అయ్యిపోయింది. ట్రైలర్ బాగుందని అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్ట్ లు వచ్చాయి. అదే సమయంలో ఈ సినిమాని ఓ హాలీవుడ్ చిత్రం నుంచి లేపారంటూ కూడా కొంతమంది పోస్ట్ లు పెడుతున్నారు.

నటిని అసభ్యంగా తాకి, హింసించిన వ్యక్తి అరెస్ట్!

2019 జనవరి 25న రిలీజైన The Farewell అనే అమెరికన్ కామెడీ డ్రామా ఆధారంగా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంకథ తయారైందంటున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో  వృద్ధాప్యంలో ఉన్న తాత సత్యరాజ్‌కు అడ్వాన్స్‌డ్ లంగ్ క్యాన్సర్, ఐదు వారాలే ఆయుష్యు. ఫారెన్‌లో జాబ్ చేస్తున్న చిన్న కుమారుడికి.. తండ్రి దగ్గర ఐదువారాలు గడిపేందుకు ఎలా షెడ్యూల్ చేసుకుున్నాడు...పెద్ద కుమారుడిగా రావు రమేశ్ తండ్రి విషయంలో ఎలా బిహేవ్ చేసాడు.  

మారే కాలంతో పాటు మనమూ మారాలి.. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలని తాత సత్యరాజ్ ఆలోచనలు ఎలా మారాయి వంటి విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది. అదే సమయంలో మనవడు సాయితేజ్.. తాతయ్యకు మనోధైర్యం కల్పిస్తాడు.. ఇప్పటివరకూ తాత చేద్దామనుకుని చేయలేనివి. చేయలేనని మధ్యలో ఆపేసినవి, వీటితో పాటు మిగిలిన ఆశలు, కోరికలను కూడా  నెరవేర్చేస్తాడు. ఫారెన్‌లోని కుమారులను కూడా తండ్రి దగ్గరకు వచ్చేలా చేయటమే కథాంశం.

 The Farewell  సినిమాలో కూడా కుటుంబానికి పెద్ద అయిన నాయనమ్మ ..చైనాలో ఉంటుంది. ఆమెకు కాన్సర్ అడ్వాన్స్ స్టేజీ. ఎంతోకాలం బ్రతకదు. వాళ్ల పిల్లలు అమెరికాలో, జపాన్ లో ఉంటారు. మనమరాలికి నాయనమ్మ అంటే ప్రాణం. దాంతో ఆమె తన నాయనమ్మతో ఎలా జర్నీ చేసిందనేది ఈ సినిమా కథాంశం. అయితే ఈ సినిమా కథ మొత్తం నాయనమ్మకు కాన్సర్ విషయం తెలియకుండా ఎలా దాచారో అనే పాయింట్ చుట్టు తిరుగుతుంది.

చిత్రలహరి సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన సాయి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగేతో మరో హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.