మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడిగా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. గత ఏడాది వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ప్రారంభమైంది. మైత్రి మూవీస్ బ్యానర్ లో స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఉప్పెన అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

ఎట్టకేలకు చిత్ర యూనిట్ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోని విడుదల చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని జనవరి 23 గురువారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 

52 ఏళ్ళ హీరోయిన్ ఐదో పెళ్లి.. ఆమె భర్త శృంగార లీలలు తెలుసా!

సుకుమార్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ లుక్, నటన ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

వైష్ణవ్ కు జోడిగా కీర్తి శెట్టి నటిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది కాబట్టి నిర్మాణ విలువలు బావుంటాయి. వైష్ణవ్ తన తొలి చిత్రంతో ఎలా మెప్పిస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.