సినీ వారసత్వంతో పాటు సేవాగుణాన్ని కూడా వారసత్వంగా తీసుకున్నారు మెగా హీరోలు. మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ పలు సేవ కార్యక్రమాలతో అభిమానుల గుండెల్లో నిలిచినట్లుగానే వారి వారసులు కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. అందులో వారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ముందుంటాడని చెప్పవచ్చు.

నిత్యం ఎదో ఒక సేవా కార్యక్రమంతో ఆకట్టుకునే సాయి ధరమ్ తేజ్ అయ్యప్ప మాలలో ఉన్న చాలా భక్తులకు అన్నదానం చేశారు. ఫిలిం నగర్ లో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో దాదాపు 500ల మందికి పైగా పాల్గొన్నారు. సాయి తేజ్ సొంత ఖర్చులతో ఈ అన్నదానం చేయించారు. కార్యక్రమంలో చాలా మంది స్వాములు పాల్గొని మెగా హీరోని ఆశీర్వదించారు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.

గతంలో కూడా ఈ మెగా హీరో షూటింగ్ లో ఉన్న తనను చూడటానికి వచ్చిన అభిమానులకు కడుపునిండా అన్నం పెట్టి పంపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక నిత్యం ఏదో ఒక అనాధశరణాలయాలకు వెళుతూ వారికి కూడా తన వంతు సాయం అందిస్తూ ఉంటారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్బంగా ఒక అనాధరాశరణాయ బిల్డింగ్ కట్టేందుకు సాయి దోహదపడ్డాడు. ప్రస్తుతం ఈ హీరో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. చరిత్రలో చూడని డెడ్లీ కాంబినేషన్స్!