కోలీవుడ్ లో గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా 96. విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సినిమా టివిలో టెలికాస్ట్ అయినప్పటికీ థియేటర్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో  నడిచింది అంటే సినిమా ఏ స్థాయిలో లాభాల్ని అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు ఆ కథ తెలుగులో కూడా ఆ డే ఫార్మాట్ లో తెరకెక్కుతోంది. కథలో ఎలాంటి ఫీల్ మిస్సవ్వకూడదని నిర్మాత దిల్ రాజు అదే దర్శకుడితో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమా పనులు ఎండ్ కి వచ్చేశాయి. ఇక సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ లవర్స్ డే మూమెంట్ లో రిలీజ్ చేయాలనీ నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రానున్న ఆ సినిమాకు అదే సరైన రిలీజ్ డేట్ అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

త్వరలోనే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తో సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.  ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. చిత్ర షూటింగ్ తాజాగా ముగిసినట్లు సమంత ఇటీవల సోషల్ మీడియాలో పేర్కొంది. 96 చిత్రంలోని తన స్టిల్ ని పోస్ట్ చేసింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. నా కెరీర్ లో ఇది కూడా ఒక ప్రత్యేక చిత్రం. గతంలో కంటే బాగా నటించేలా ఈ చిత్రంలోని పాత్ర నన్నే ఛాలెంజ్ చేసింది.   ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్, శర్వానంద్ లకు నా ధన్యవాదాలు అని సమంత ఆ ట్వీట్ లో పేర్కొంది.

read also: రానా, సమంతలకి ఛాలెంజ్ విసిరిన సాయి పల్లవి!