తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో  భాగంగా చాలా మంది రాజకీయనాయకులు, సామాన్యులు, సెలబ్రిటీలు మొక్కలు నాటారు.

ఆ ఛాలెంజ్ స్వీకరించిన అఖిల్ తను మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సోదరుడు నాగచైతన్య, వరుణ్ తేజ్ కి విసిరారు.అఖిల్ ఇచ్చిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన వరుణ్ ఈ మంచి పని చేయడానికి సాయి పల్లవి, తమన్నా లను నామినేట్ చేశారు.

ఈ ఛాలెంజ్ స్వీకరించిన సాయి పల్లవి ఓ మొక్క నాటారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఆమె అన్నారు. అనంతరం ఆమె ఈ ఛాలెంజ్ కోసం సమంత, రానాలను నామినేట్ చేశారు.

ఈ ఛాలెంజ్ ని రానా స్వీకరించనున్నట్లు చెప్పారు. సాయి పల్లవి పోస్ట్ కి ఆయన 'ఆన్ ఇట్ బాస్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'విరాటపర్వం 1992' అనే సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.