మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించినా అది ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడే చరణ్ తదుపరి చిత్రం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ జాబితాలో మరో సంచలన దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది. రన్ రాజా రన్ చిత్ర విజయంతో దర్శకుడు సుజీత్ ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. కానీ ఆ సువర్ణావకాశాన్ని సుజీత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

బోల్డ్ ఇమేజ్ ని వదిలిపెట్టను.. పాయల్ రాజ్ పుత్ హాట్ కామెంట్స్!

తాజాగా సమాచారం మేరకు సుజీత్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడట. ఇటీవల సుజీత్ రామ్ చరణ్ ని కలసి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. దీనికి చరణ్ పూర్తి కథ సిద్ధం చేసి వినిపించాలని కోరినట్లు తెలుస్తోంది. దీనితో సుజీత్ ప్రస్తుతం చరణ్ ని మెప్పించేలా మంచి కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. 

హాలీవుడ్ ఫార్ములా వల్లే రాజమౌళికి సక్సెస్.. రజనీ క్లాస్ పీకారు: హీరో సుమన్

సాహో లాంటి డిజాస్టర్ తర్వాత సుజీత్ దర్శత్వంలో నటించే సాహసం చరణ్ చేస్తాడా అనే వాదన కూడా వినిపిస్తోంది. సుజీత్ ప్రతిభగల దర్శకుడని అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబోలో చిత్రం తెరకెక్కే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సాహో ఎఫెక్ట్ నుంచి బయట పడాలంటే సుజీత్ కొంచెం గట్టిగానే ప్రయత్నించాలి.