అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. చూడడానికి పక్కింటి అమ్మాయి లాగే అనిపించడంతో పరభాషా అంటి అనే ఫీలింగ్తెలుగువారికి కలగలేదు. 

పైగా చక్కగా తెలుగునేర్చుకుని తన డబ్బింగ్ తానే చెప్పుకుంది. తెలుగులో అనుపమ ఖాతాలో అ..ఆ.., శతమానం భవతి లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. కాగా ఇటీవల అనుపమకు సరైన సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. కానీ అనుపమ అద్భుతమైన నటి అని చెప్పడంలో సందేహం లేదు. కానీ అనుపమ స్కిన్ షోకు పూర్తిగా దూరం. దీనితో ఇటీవల టాలీవడ్ కు వచ్చిన కొత్తభామల నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. 

మైత్రి, చిరంజీవి కాంబినేషన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం అనుపమకు సరైన అవకాశాలు లేని కారణంగా టాలీవుడ్ కు దూరం అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ఇకపై పూర్తిగా తమిళం, మలయాళీ చిత్రాలపైనే ఫోకస్ చేయాలని అనుపమ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా అనుపమ, క్రికెటర్ బుమ్రా మధ్య సీక్రెట్ ఎఫైర్ సాగుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో కాలమే సమాధానం చెప్పాలి.