మెగాస్టార్ చిరంజీవి జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది చిరు ఖైదీ నెం 150 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించబోయే మూవీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మైత్రి మూవీస్ సంస్థ వరుసగా భారీ చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. పైగా ప్రస్తుతం మైత్రి చేతిలో మెగాహీరోల చిత్రాలు ఉన్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం తెరక్కుతుండగా..  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో చిత్రం కూడా పట్టాలెక్కింది. 

మరో శ్రీరెడ్డి.. సెక్స్ కి రెడీ అంటే బంపర్ ఆఫర్ నీకే.. టిక్ టాక్ భామ కామెంట్స్

ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక మైత్రి సంస్థ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో చిత్రాన్ని మైత్రి నిర్మించనుంది. తాజాగా మైత్రి నిర్మాతలు మరో మెగా మూవీని కూడా తమ బుట్టలో వేసుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. 

ఈ సంస్థలో సినిమా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి అంగీకారం తెలిపినట్లు టాక్. యంగ్ డైరెక్టర్ బాబీ ఈ క్రేజీ కాంబోలో చిత్రానికి దర్శకత్వం వహించేఅవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.