నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు ఈ సినిమాకి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని లైట్ తీసుకున్నారు.

ఇలాంటి సమయంలో చిత్రనిర్మాత సి.కళ్యాణ్ చేసిన కామెడీ వైరల్ అవుతోంది. తమ సినిమా పైరసీకి గురైందని.. అందుకే థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. క్వాలిటీగా సినిమా తీసి తప్పు చేశామని అంటున్నారు. క్వాలిటీ బాగుండాలని.. 4కేలో సినిమా తీశామని.. ఆ క్వాలిటీనే ఇప్పుడు ఇబ్బందిగా మారిందని.. వీడియో పైరసీ అయిపోతుందని అన్నారు.

ఆ నిర్మాత డేట్ కి పిలిచాడు.. వేశ్య అన్నారు.. నటి కామెంట్స్!

ఇప్పటివరకు దాదాపు ఏడు వేలకు పైగా లింక్స్ డిలీట్ చేశామని.. పైరసీలో ఆ క్వాలిటీ చూస్తే బాధేస్తుందని అన్నారు. ఇంత క్వాలిటీగా సినిమా తీయకూడదనిపిస్తోందని.. ఇలానే అందరూ పైరసీ చూస్తే క్వాలిటీ తగ్గించేస్తామని అన్నారు.

ఓ పక్క థియేటర్లలో జనాలు లేక ఒక్కో థియేటర్ నుండి సినిమా తీసేస్తుంటే.. సి.కళ్యాణ్ మాత్రం దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదీ కాకుండా సినిమా సక్సెస్ ను తను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పడం జనాలకు కామెడీగా అనిపిస్తోంది.

సినిమా బాగుందని తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని.. కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయని.. బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫోన్ పెట్టడం లేదని తెగ మాటలు చెప్పారు సి.కళ్యాణ్. 'జై సింహా'ని మించిన రీతిలో రూలర్ సినిమా తీశానని.. త్వరలోనే 'రూలర్'ని తలదన్నే సినిమా తీస్తామని చెప్పి మరింత కామెడీ చేశారు సి.కళ్యాణ్.