ఓ నిర్మాత పరోక్షంగా తనను లైంగికంగా వేధించాడని ప్రముఖ నటి కల్కి కొచ్లిన్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యల గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2013లో రణబీర్ కపూర్, దీపికా పదుకోన్ తో కలిసి 'యే జావనీ హై దివానీ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినప్పటికీ అవకాశాలు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సినిమా విడుదల తరువాత దాదాపు తొమ్మిది నెలల పాటు ఎలాంటి ఆఫర్ రాలేదని.. ఖాళీగా ఉన్నానని.. హిట్ వచ్చినప్పటికీ ఇలా జరగడం బాధగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఓ నిర్మాత తనను నేరుగా కాకుండా పరోక్షంగా వేధించాడని.. తనతో పాటు డేట్ కి రావాలని అడిగాడని.. దానికి తాను ఒప్పుకోలేదని వెల్లడించింది.

మద్యపానం మానేశా.. శృంగార తార సోనా వ్యాఖ్యలు!

దీంతో అతడు తనను సినిమా నుండి తప్పించాడని తెలిపింది. గతంలో కూడా తాను వేధింపుల గురించి మాట్లాడిన సంగతి గుర్తుచేసుకుంది. ఈ విషయాన్ని మొదట తన థెరపిస్ట్ కి ఆ తరువాత తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా ఉన్నాయని వెల్లడించింది.

తను హాలీవుడ్ కి వెళ్లినప్పుడు అక్కడ కాస్టింగ్ ఏజెంట్ ఒకరు తన ముఖం దగ్గరకి వచ్చి.. కళ్లకింద వలయాలు చూశాడని చెప్పింది. 'దేవ్ డి' సినిమాలో తనను చూసిన కొందరు 'రష్యన్ వేశ్య' అన్నారని.. 'ఈ రష్యన్ వేశ్యని ఎక్కడ నుండి తీసుకొచ్చారు' అని అనేవారని.. వాళ్లకి 'నేను రష్యన్ ని కాదు' అని చెప్పుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. 'దేవ్ డి' సినిమాలో కల్కి వేశ్య పాత్రను పోషించారు.