నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కేఎస్ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రూలర్‌'. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో బాలకృష్ణ, రవికుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన 'జై సింహా' సినిమా సక్సెస్ అవ్వడంతో 'రూలర్' పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించగలిగింది.

సమంత లేటెస్ట్ ఫొటోస్.. ఓ లుక్కేయాల్సిందే!

బాలయ్యని స్టైలిష్ బిజినెస్ మెన్ గా, మాస్ పోలీస్ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ లో చూపించారు. రిలీజ్ కి ముందు సినిమాపై పెద్దగా బజ్ లేనప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.23 కోట్ల వరకు జరిగింది. అయితే తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.4.25 కోట్ల షేర్ ని రాబట్టింది. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 

నైజాం....................................రూ. 68 లక్షలు
సీడెడ్.....................................రూ.1.08 కోట్లు
ఉత్తరాంధ్ర..............................రూ.27 లక్షలు
ఈస్ట్........................................రూ.26 లక్షలు
వెస్ట్.........................................రూ.25 లక్షలు
గుంటూరు................................రూ. 1.30కోట్లు
కృష్ణ........................................ రూ.19 లక్షలు
నెల్లూరు................................... రూ. 22 లక్షలు

మొత్తం ఏపీ, తెలంగాణాలలో కలిపి ఈ సినిమా రూ.4.25 కోట్ల షేర్ ని రాబట్టింది.