దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న మూవీ కావడంతో దేశం మొత్తం ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ కోసం ఎదురుచూస్తోంది. 

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది అభిమానులకు పండగే అవుతోంది. రాంచరణ్, ఎన్టీఆర్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించే నటీనటుల్ని ఆర్ఆర్ఆర్ టీం ఇది వరకే ప్రకటించింది. కొన్ని రోజులు క్రితం 75 శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ నిజంగానే 75 శాతం షూటింగ్ పూర్తయిందా.. చిత్రం అనుకున్న సమయానికే ఈ ఏడాది జులై 30 విడుదలవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. 

బాలీవుడ్ క్రేజీ హీరో అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అతడి పాత్ర ఇంతవరకు ప్రారంభమే కాలేదని అర్థం అవుతోంది. అజయ్ దేవగన్ నటించిన తన్హాజి చిత్రం జనవరి 10న విడుదల కానుంది. దీనితో అజయ్ దేవగన్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. 

'తన్హాజి చిత్ర విడుదల సందర్భంగా అజయ్ దేవగన్ సర్ కు శుభాకాంక్షలు. మిమ్మల్ని త్వరలో ఆర్ఆర్ఆర్ సెట్స్ లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని ట్వీట్ చేశారు. అంటే ఇంతవరకు అజయ్ దేవగన్ పాత్ర ప్రారంభం కాలేదని అర్థం అవుతోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం 75 శాతం షూటింగ్ పూర్తయినట్లు చెబుతోంది. 

అమరావతి రైతుల మృతి.. సింగర్ స్మిత షాకింగ్ కామెంట్స్ వైరల్!

దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ స్పష్టమైన ప్రకటన చేసే వరకు అభిమానులకు ఈ గందరగోళం తప్పదు. 1920 కాలంలో స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ అల్లరిగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.