దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లోనటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తి చేసుకుందని చిత్రబృందం వెల్లడించింది.

ఈ సినిమాలో తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ అనే విదేశీ అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఏడు నుండి ఎనిమిది పాటలు ఉంటాయనే వార్తలు వచ్చాయి.

కొత్త ఇల్లు కొనుక్కున్న విజయ్ దేవరకొండ..!

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియా భట్ ల మధ్య ఓ రొమాంటిక్ పాటని చిత్రీకరించనున్నారట. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సెట్ భారీగా ఉండబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు
కానీ ఈ పాట ఆడియన్స్ కి ఐఫీస్ట్ అని టాక్.

ఇక ఈ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నటుడు ఐర్లాండ్‌కు చెందిన రేమండ్ స్టీవెన్సన్ ని ఎంపిక చేసుకున్నారు. మరో ముఖ్య పాత్రలో హాలీవుడ్  ఆలిసన్ డూడీ అనే 53 ఏళ్ల హాట్ బ్యూటీని తీసుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020 జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.