టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫిల్మ్ నగర్ కి షిఫ్ట్ అయ్యారు. ఇటీవల ఫిల్మ్ నగర్ లో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు విజయ్ దేవరకొండ. ఆదివారం నాడు గృహప్రవేశం కూడా చేసినట్లు తెలుస్తోంది.

తన తల్లితండ్రులు, కొందరు సన్నిహితులతో కలిసి కొత్త ఇంట్లో దిగినట్లు సమాచారం. గృహప్రవేశం కార్యక్రమాన్ని సింపుల్ గా చేసినప్పటికీ తన స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ మాత్రం ఇచ్చాడట. సినిమాల విషయానికొస్తే.. 'గీత గోవిందం' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ హీరోకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.

'చిరుత' పిల్ల ఘాటు సొగసులు.. క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తోంది!

తెలుగుతో పాటు తన సినిమాలను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవల దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదలైన 'డియర్ కామ్రేడ్' సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ప్రస్తుతం తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ ఉండేలా చూసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరిన్ లాంటి హీరోయిన్లు నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమా పూర్తయిన తరువాత విజయ్.. దర్శకుడు పూరి జగన్నాథ్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.