Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్: తెలుగు రాష్ట్రాల్లో 'RRR' బిజినెస్ (ఏరియావైజ్)

ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ షాకింగ్ న్యూస్ గా మారింది. ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు. 

RRR pre release business in Telugu states
Author
Hyderabad, First Published Feb 11, 2020, 11:12 AM IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం గురంచి రోజుకో సెన్సేషన్ న్యూస్ మీడియాలో వస్తూ సెన్సేషన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ షాకింగ్ న్యూస్ గా మారింది. ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 210 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఏరియావైజ్ గా ఆ డిటేల్స్ చూద్దాం.

RRR '*' లేకుండా ఇండస్ట్రీ హిట్.. నెటిజన్ కు బాహుబలి నిర్మాత రిప్లై!

నైజాం –  దిల్ రాజు – రూ. 75కోట్లు

సీడెడ్  – సాయి కొర్రపాటి – రూ. 36కోట్లు

వైజాగ్ – సాయి కొర్రపాటి – రూ. 24కోట్లు

ఈస్టో గోదావరి – భరత్ చౌదరి & కో – రూ. 19కోట్లు

వెస్ట్ గోదావరి – ప్రవీణ్ & కో – రూ. 16కోట్లు

కృష్ణా – మైత్రీ మూవీ మేకర్స్ – రూ. 15కోట్లు

గుంటూరు – యువి – రూ. 18కోట్లు

 నెల్లూరు – సుధాకర్ – రూ. 9కోట్లు

అలాగే ఇతర భాషల్లోనూ థియోటర్ బిజినెస్ మరో రెండు వందల కోట్ల వరకూ జరిగే అవకాసం ఉందని లెక్కలు వేస్తున్నారు. ఇక డిజిటల్, శాటిలైట్ వంటి నాన్ థియోటర్ బిజనెస్ ఇప్పటికు ఇంకా  క్లోజ్ చేయలేదు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 8, 2021 న రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం.  రాజమౌళి సినిమాల్లో క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో వుంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ జోడీగా అలియా భట్ .. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios