దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 

ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర విశేషాలు తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ రాజమౌళి ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. దీనితో అభిమానులు ఆసక్తిని అణుచుకోలేక రాజమౌళితో సంబంధం ఉన్న సెలెబ్రిటీలందరిని ఆర్ఆర్ఆర్ గురించి అడిగేస్తుంటారు. 

విజయ్ పై ఐటీ రైడ్స్.. అజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజాగా ఓ నెటిజన్ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డని ప్రశ్నించాడు. శోభు గారు మీకు ఆర్ఆర్ఆర్ కథ తెలుసా.. ఒక వేళ తెలిస్తే ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అని ప్రశ్నించాడు. దీనితో శోభు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆర్ఆర్ఆర్ కథ నాకు తెలియదు. కేవలం ఒక్క రోజు మాత్రమే ఈ చిత్ర సెట్స్ కు వెళ్ళాను. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం తప్పకుండా ఇండస్ట్రీ హిట్ అవుతుంది.. ఎలాంటి '*' అవసరం లేకుండా అని శోభు ఫన్నీగా బదులిచ్చాడు. 

రూ.75 కోట్లు ఆఫర్ చేసిన దిల్ రాజు.. ఎవరికో తెలుసా?

ఆయన మాటల్లో మీనింగ్ చాలానే ఉంది. బాహుబలి సాధించిన విజయం ఇండియన్ చిత్రాలకు ఒక బెంచ్ మార్క్ గా మారింది. ఇటీవల ఏ చిత్రం మంచి వసూళ్లు సాధించినా * సింబల్ తో నాన్ బాహుబలి రికార్డ్ అని వేస్తున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆ అవసరం ఉండదని బాహుబలి రికార్డులని అధికమిస్తుందని శోభు సింపుల్ గా చెప్పారు.