రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఫైనల్ గా సినిమాలో  మరో హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేశారు.

ఒలీవియా మోరిస్ అనే ఇంగ్లీష్ బ్యూటీని ఎన్టీఆర్ కి జోడిగా సెట్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన RRRలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయంలో గతకొంత కాలం నుంచి వస్తున్న రూమర్స్ కి క్లారిటీ వచ్చేసింది . లండన్ కి చెందిన ఒలీవియాను గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

అప్పటి బ్రిటిష్పాలకుల కుటుంబానికి చెందిన జెన్నిఫర్ గా ఒలీవియా RRRలో దర్శనమివ్వనుంది. మరి తారక్ తో ఆమె నటన ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.  ఇకపోతే సినిమా షూటింగ్ కి హీరోల గాయలకారణంగా మద్యమద్యలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం తొందరపడకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు.

రాజమౌళి మరీ ఇంత స్పీడా..? నమ్మొచ్చా..?

ఇప్పటికే సినిమా షూటింగ్ 70% పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.   ఇద్దరి పాత్రలకు సంబందించిన సన్నివేశాలను సమానంగా పూర్తి చేస్తున్న జక్కన్న మిగతా 30% షూటింగ్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా 350కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న తెలుగు సినిమాగా RRR సినీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.