దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా ఏళ్లకు ఏళ్లు షూటింగ్ జరుపుకుంటుందనే కంక్లూజన్ కి వచ్చేస్తాం. ఆయన తీసేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కాబట్టి ఆ మాత్రం సమయం పడుతుందనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజమౌళి అసలు కాంప్రమైజ్ అవ్వరు. సినిమాకి సంబంధించిన ప్రతీ విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

కొన్ని సార్లు ఊహించని విధంగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరగపోవడం వంటివి జరుగుతూ ఆయన సినిమాలు మరింత ఆలస్యమయ్యాయి. 'బాహుబలి' సినిమా రెండు భాగాలకు కలిపి రాజమౌళి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. దీని తరువాత ప్రస్తుతం ఆయన 'RRR' సినిమా కోసం పని చేస్తున్నారు.

కార్తీక దీపం సీరియల్ దీప అలియాస్ వంటలక్క: ఎవరీ ప్రేమీ విశ్వనాథ్?

ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే.. దీని ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టింది. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుండి ఏడాదిన్నరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు జక్కన్న. కానీ రాజమౌళి గురించి తెలిసిన వారు చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ చేస్తారని అనుకోలేదు. 

దానికి తగ్గట్లే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ షూటింగ్ లో గాయపడడం ,ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరక్క పోవడం వంటివి జరగడం షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం సాగలేదు. దీంతో 2020 చివరికైనా సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటివరకు సగం షూటింగ్ అయిన పూర్తై ఉంటుందా...? అనే అనుమానాలు కలిగాయి. కానీ 'RRR' టీం తాజాగా 70 శాతం షూటింగ్ పూర్తయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి షాకిచ్చింది.

ఈ ఏడాది ఆరంభంలో షూటింగ్ మొదలుపెట్టిన జక్కన్న పది నెలల్లో డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేశాడంటే జనాలకు నమ్మశక్యం కావడం లేదు. హీరోలకు గాయాలు, ఇంకా ఎన్టీఆర్ కి హీరోయిన్ కూడాదొరకలేదు. అలాంటిది షూటింగ్ డెబ్బై శాతం ఎలా అవుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి చెప్పినట్లుగానే షూటింగ్ పూర్తైందంటే మాత్రం సినిమా కచ్చితంగా ముందు అనౌన్స్ చేసినట్లు జూలై 30కి రావడం పక్కా అనే అనుకోవాలి.