దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాస్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా 350కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న తెలుగు సినిమాగా RRR సినీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

ఇకపోతే సినిమా షూటింగ్ కి హీరోల గాయలకారణంగా మద్యమద్యలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం తొందరపడకుండా అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ 70% పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.

చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు.. చరిత్రలో చూడని డెడ్లీ కాంబినేషన్స్! 

ఇద్దరి పాత్రలకు సంబందించిన సన్నివేశాలను సమానంగా పూర్తి చేస్తున్న జక్కన్న మిగతా 30% షూటింగ్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ కష్టపడుతున్నాడు. ఇక సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ అప్డేట్ ని రేపు ఎనౌన్స్ చేయనున్నారు. రామ్ చరణ్ సరసన RRRలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనే విషయంలో రేపు క్లారిటీ రానుంది.

ఒక స్పెషల్ బ్యూటీని తారక్ కోసం ఇప్పటికే సెలెక్ట్ చేసి ఉంచారు.  చిత్ర యూనిట్ బుధవారం ఈ విషయంపై స్పెషల్ అప్డేట్ అందించనుంది. దీంతో అభిమానులు ఆ అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు హీరోయిన్ విషయంలో పెద్దగా రూమర్స్ రాలేవు. మరి ఆ లక్కీ బ్యూటీ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.