దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బాహుబలి చిత్రంతో రాజమౌళి సృష్టించిన సంచలనం అలాంటిది మరి. బాహుబలి చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఇది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. 1920లో బ్రిటిష్ పాలన నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతోంది. అల్లూరి, కొమరం భీం స్నేహితులై ఉంటే ఎలా ఉండేది అనే ఊహాజనిత కాన్సెప్ట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

కీరవాణి తనయులు శ్రీసింహా ప్రధాన పాత్రలో.. మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా.. డెబ్యూ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం మత్తువదలరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రాజమౌళి స్వయంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరై చిత్ర యూనిట్ ని ప్రోత్సాహించారు. 

ఎగిరి గంతేసిన హీరోయిన్.. జూ.ఎన్టీఆర్ పై ముద్దుల వర్షం!

శ్రీసింహా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో శ్రీ సింహా చిన్నప్పటి ఎన్టీఆర్ గా నటించాడు. ఆ సంగతులని శ్రీ సింహా గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే ఏ చిత్రం పేరు చెబుతారు అని ప్రశ్నించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రం అని శ్రీ సింహా వెంటనే బదులిచ్చాడు. నాకు ఆర్ఆర్ఆర్ కథ తెలుసు.. అందుకే ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ అవుతుందనే ధీమాని శ్రీసింహా వ్యక్తం చేశాడు.