ఏ సినిమాకు అయినా కొన్ని ఎపిసోడ్స్  హైలెట్ గా ముందే ప్లాన్ చేసుకుంటారు. మరీ ముఖ్యంగా రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ సినిమాలో హైలెట్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ స్పెషల్ గా ప్లాన్ చేస్తారు. అలాంటి ఓ ఎపిసోడ్ ని రాజమౌళి తాజాగా షూట్ చేయబోతున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే..ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. కొమరం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  దీని ప్రకారం.. ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే మేజర్ హైలెట్ గా ఉండనుందిట. అది ఓ వార్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఈ వారంలోనే ఆ ఎపిసోడ్  షూటింగ్ జరగనుంది.

‘అల.. వైకుంఠపురములో’ పోస్టర్ పై మండిపడుతున్న మహేష్..?

సినిమాలో పావు గంట సేపు ఈ ఎపిసోడ్ రానుందని తెలుస్తోంది. బ్రిటీష్ వారికి చెందిన సైన్యాన్ని మన ఇద్దరు హీరోలు కలిసి ఎదిరించటం జరుగుతుందిట. ఇధి క్లైమాక్స్ బ్లాక్ అంటున్నారు. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతుందని, ఇందుకోసం గత కొద్ది రోజులుగా టీమ్ మొత్తం కసరత్తులు చేసిందని తెలుస్తోంది. రాజమౌళి ప్రత్యేక దృష్టి పెట్టి మరీ ఈ ఎపిసోడ్ ని రూపొందిస్తున్నారు.
 
నిర్మాత డివివి దాన‌య్య దాదాపు 350కోట్ల బ‌డ్జెట్ తో చేస్తున్న ఈ చిత్రంలో  ఆలియా భ‌ట్, ఒలీవియో హీరోయిన్స్ గా ఆడిపాడుతున్నారు. స్వాతంత్య్ర కాలం నాటి ఫిక్ష‌న్ డ్రామాతో ఈ సినిమా తెర‌కెక్కుతున్న  ఈ సినిమాలో సుమారు ఏడు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఆవేశంతో కూడినవి, చైతన్యం రగిల్చేవి, ప్రేమ పాటలు కూడా ఉండొచ్చని వినికిడి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రాశారని సమాచారం.

మరో ప్రక్క  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే పొడి అక్షరాల్ని ప్రతిబింబించే టైటిల్‌ పెట్టమంటూ ఇదివరకే రాజమౌళి అభిమానుల్ని కోరారు. ఆ నేపథ్యంలో సోషల్‌  మీడియాలో వందలాది టైటిళ్లు చక్కర్లు కొట్టాయి. అందులో ఓ పేరుని చిత్ర యూనిట్ ఖరారు చేసిందని సమాచారం. ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అనే పేరు బాగుంటుందని అనుకుంటున్నారట. మిగిలిన భాషల్లో  ‘రైజ్‌ రివోల్ట్‌ రివెంజ్‌’ పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే  ఈ టైటిల్‌కి సంబంధించి చిత్రం టీమ్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.