ఈ సంక్రాంతికి తెలుగులో రెండు పెద్ద చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి.  ‘అల.. వైకుంఠపురములో’ అమెరికాలో కేవలం 175 లొకేషన్లలో రిలీజయ్యి మొదటి రోజే దాదాపు 800కె డాలర్ల వసూళ్లు సాధించి రికార్డ్ నెలకొల్పటంతో టీమ్ చాలా ఉత్సాహంగా ఉంది. ‘సరిలేరు’ కంటే తక్కువ టికెట్ ధర(14 డాలర్ల)తోనే బన్నీ ఈ రేర్ ఫీట్ అందుకోవడం హైలెట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సంక్రాంతి విన్నర్ ... ‘అల.. వైకుంఠపురములో’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఇది చూసిన మహేష్ మండిపడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరో 'కొరియా' రీమేక్ తో సురేష్ ప్రొడక్షన్..దర్శకుడు ఎవరంటే..?

ఇంకా పండుగ పూర్తికాలేదు..అప్పుడే సంక్రాంతి విన్నర్ అంటూ ఎలా ప్రకటిస్తారు అంటున్నారట. ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో అదే ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు పోటీలో ఉన్నప్పుడు ..పోటీ పూర్తయ్యేదాకా ఇలాంటి ప్రకటనలు చేయకూడదని హితవు చెప్తున్నారు. అయితే వార్ వన్ సైడ్ అయ్యిపోయింది.  ‘అల.. వైకుంఠపురములో’ ఖచ్చితంగా సంక్రాంతికి పెద్ద హిట్, అందుకే అలా తేల్చేసారు అని బన్ని అభిమానులు సమర్దిస్తున్నారు.

ఇక ఆదివారం నాడు విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు రికార్డ్స్ కలెక్షన్లు సాధించి కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ దశగా పరుగులు తీస్తోంది. తమన్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయడం కలిసొచ్చింది. అలాగే  త్రివిక్రమ్ మార్క్ మరోసారి చూపించారని.. బన్నీని కొత్తగా చూపించారంటూ అంటున్నారు.

అలాగే సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మహేష్‌ కెరీర్ లో పెద్ద సక్సెస్ ని ఇచ్చింది.  ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ తర్వాత మహే‌ష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.  కానీ ఈ స్దాయిలో వసూళ్లు రాబడతాయని ఎవ్వరూ ఊహించలేదు. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టింది.