బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోని బీట్ చేయాలని ఎన్ని షోలు వస్తున్నా.. దీని ముందు నిలబడలేకపోతున్నాయి. మొదట్లో వారానికి ఒకసారి వచ్చే ఈ షో ఆ తరువాత నుండి వారానికి రెండు సార్లు ప్రసారం చేయడం లొడలుపెట్టారు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లకు లైఫ్ దొరికింది. 

చాలా మంది సినిమాల్లో కూడా క్లిక్ అవుతున్నారు. అలాంటి స్టార్ డం కమెడియన్ నరేష్ కి కూడా దక్కింది. 'జబర్దస్త్' నరేష్ ఎత్తు మూడు అడుగులు మాత్రమే కానీ అతడికున్న టాలెంట్ ని తక్కువ అంచనా వేయలేం. బుల్లితెరపై అతడికి మంచి డిమాండ్ ఉంది.

పూజా హెగ్డేపై మండిపడుతున్న నమ్రత.. డబ్బే కారణమా..?

'జబర్దస్త్' షోతో పాటు మరికొన్ని షోలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా సంక్రాంతికి రాబోయే ఓ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ షోలో పెద్దలను, పిల్లలను రెండు గ్రూప్ లుగా విడదీసి వారితో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఈ షోకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తుండగా.. రోజాతో సహా పలువురు యాంకర్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.

షోలో భాగంగా 'జబర్దస్త్' నరేష్ ''కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరిక్కడ'' అంటూ ఓ డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ కొద్దిరోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పారు. ఇదే డైలాగ్ ని నరేష్ కామిక్ గా చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వేశారు.

నరేష్ రెండు, మూడు సార్లు అదే డైలాగ్ చెప్పడంతో రోజా నవ్వుకుంటూ అతడికి వార్నింగ్ ఇవ్వడానికి స్టేజ్ పైకి వచ్చారు. కళ్లు పెద్దవి చేస్తూ రోజా.. నరేష్ వంక చూడడంతో అందరూ పగలబడి నవ్వేశారు.