నమ్రత మహేష్ బాబు కొన్ని విషయాలలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మహేష్ ఫైనాన్స్ వ్యవహారాలు దగ్గరుండి చూసే ఆమె డబ్బు ఖర్చు విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తారు. తాజాగా ఆమె ఓ బ్యానర్ పెట్టి మేజర్ అనే చిత్రం ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మల్టిలింగ్వల్ ప్రాజెక్టుగా రూపొందనున్న ఈ చిత్రం జిఎమ్ బి బ్యానర్ లో రూపొందుతోంది. అడివి శేష్ హీరోగా రూపొందే ఈ చిత్రంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా అడిగినట్లు సమాచారం.

నడుము అందాలతో మత్తెక్కిస్తోన్న యాంకర్ అనసూయ!

అయితే అందుతున్న సమాచారం మేరకు పూజా హెగ్డేకు, నమ్రతకు మధ్యన రెమ్యునేషన్ విషయంలో భేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ లలో ఫుల్ డిమాండ్ తో ఉన్న పూజతో నమ్రతకు మంచి రిలేషన్ ఉంది. మహర్షి చిత్రం తో వీరిద్దరి మధ్యా మంచి బాండింగ్ ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తమ సినిమాలో హీరోయిన్ గా అడిగింది. అయితే హౌస్ ఫుల్ 4 తర్వాత బాలీవుడ్ లోనూ క్రేజ్ ఏర్పడంతో రెమ్యునేషన్ పెంచిందట. దాంతో తను అడివి శేష్ ప్రక్కన చేయటానికి సిద్దమే కానీ రెండున్నర కోట్లు ఇవ్వమని అడిగిందట. అది విన్న నమ్రత షాక్ అయ్యిందట. మామూలుగా పూజా హెగ్డే.. కోటిన్నర నుంచి రెండు కోట్లు దాకా తీసుకుంటుంది.

కానీ రెండు లాంగ్వేజ్ లలో సినిమా అనగానే రెండున్నర అడిగిందిట. దాంతో నమ్రత వెంటనే ఆమె మేనేజర్ కు ఫోన్ చేసి ఏమైనా తగ్గిస్తారేమో అడిగిందట. అయితే ఆమెకు వరస ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి తగ్గకపోవచ్చని బదులిచ్చాడట.  దాంతో నమ్రతకు చాలా కోపం వచ్చిందిట. తన భర్తతో సినిమాలు చేసింది కదా  అని అడిగితే ఇలా సమాధానం చెప్పిందని, వేరే బాలీవుడ్ హీరోయిన్ తో ముందుకు వెళ్దామని ఫిక్సైందట. మరి ఈ విషయంలో పూజ ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుటుందో చూడాలి.