రిషి కపూర్ మరణం సినీ లోకం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. రొమాంటిక్ హీరోగా రిషి కపూర్ వందలాది చిత్రాల్లో నటించారు. రిషి కపూర్ ఏడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రిషి కపూర్ అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. 

ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో గత ఏడాది సెప్టెంబర్ లో రిషి కపూర్ ఇండియాకు తిరిగి వచ్చారు. కానీ ఇటీవల రిషి కపూర్ ఆరోగ్యం మళ్ళీ తిరగబెట్టింది. నిన్న రిషి కపూర్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ పౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. 

రిషి కపూర్ చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. రిషి కపూర్ మరణ వార్త తెలియగానే సినీ లోకం షాక్ కి గురైంది. రిషి కపూర్ కుటుంబ సభ్యులు రిలయన్స్ ఫౌడేషన్ ఆసుపత్రికి క్యూ కట్టారు. 

2020 వరస్ట్.. రిషి కపూర్ మృతికి ఎన్టీఆర్, రకుల్, ఇతర సెలెబ్రిటీల సంతాపం

రిషి కపూర్ సోదరుడు రణధీర్ కపూర్ కుమార్తె కరీనా కపూర్, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి వద్ద కనిపించారు. అలాగే రిషి కపూర్ తనయుడు రణబీర్ కపూర్ ప్రేయసి అలియా భట్ కూడా ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె కారులో వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.