కేవలం 24 గంటల వ్యవధిలో ఇండియన్ సినిమా ఇద్దరు దిగ్గజాలని కోల్పోయింది. బుధవారం ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణం చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో బాలీవుడ్ లెజెండ్ రిషి కపూర్ తుదిశ్వాస విడిచారు. రిషి కపూర్ సినీ రంగప్రవేశం ఘనంగా ప్రారంభమైంది. 1970లో రిషి నటించిన మేరా నామ్ జోకర్ చిత్రానికి గాను ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.

బ్రేకింగ్: దిగ్గజ నటుడు రిషి కపూర్ మృతి.. షాక్ నుంచి కోలుకోక ముందే..

అప్పటి నుంచి రిషి కపూర్ ఇండియన్ సినీ ప్రేక్షకులని దశాబ్దాల కాలంగా అలరిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా రిషి కపూర్ క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు. 

రిషి కపూర్ మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిషి కపూర్ మృతికి సంతాపం తెలుపుతూ ట్విటర్ లో స్పందించాడు. 'హార్ట్ బ్రేకింగ్.. నిన్ననే అద్భుతమైన ప్రతిభ కలిగిన ఇర్ఫాన్ ఖాన్ ని కోల్పోయాం. కొద్దిసేపటి క్రితమే రిషి కపూర్ సాబ్ ని కోల్పోయాం.. ఇండియన్ సినిమాకు ఇది విధ్వంసకర నష్టం' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 

 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేస్తూ.. నో నో నో ! గుండె ముక్కలయ్యే వార్త.. నాకు మాటలు రావడం లేదు. రిషి కపూర్ సర్ ఇక మనతో లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 2020 మరీ వరస్ట్ గా తయారవ్వొద్దు అంటూ రకుల్ పేర్కొంది. 

 తెలుగు, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. 2020 వరస్ట్ గా మారుతోంది. మరో లెజెండ్ రిషి కపూర్ సర్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. రిషి కపూర్ సర్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ వరలక్ష్మి సంతాపం తెలిపింది. 

మరో  ఆర్ఆర్ఆర్ నటుడు అజయ్ దేవగన్ రిషి కపూర్ మృతికి సంతాపం తెలిపారు. ఇది నా గుండెకు గాయం చేసే వార్త. ఒకదాని తర్వాత మరొక విషాదం. 2000లో రిషి సర్ తో రాజు చాచా చిత్రంతో అసోసియేట్ అయ్యాను. అప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉంటున్నాను. రిషి కపూర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని అజయ్ దేవగన్ ట్వీట్ చేశాడు.