బాలీవుడ్ నటి రిచా చద్దా తన పెళ్లి విషయంపై స్పందించారు. చాలా కాలంగా ఈ బ్యూటీ నటుడు అలీ ఫజల్ తో రిలేషన్ లో ఉంటోంది. అయితే ఇప్పట్లో పెళ్లి మాత్రం చేసుకోలేనని చెప్పేసింది. దానికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చింది.

తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంపై చర్చించారు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా పెళ్లి చేసుకోలేకపోతున్నామని చెప్పింది. పెళ్లి చేసుకోవడానికి తమ వద్ద సమయం లేదని అన్నారు.

ఆమెని నిర్భయ దోషులతో కలిపి జైళ్లో ఉంచాలి.. కంగనా ఘాటు వ్యాఖ్యలు!

పెళ్ళికి ఖచ్చితమైన తేదీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 'మార్చిలో నాకు డేట్స్‌ లేవు. మేలో ఎండలు బాగా ఉంటాయి. జూన్‌లో ఇద్దరం సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. జూలైలో వర్షాలు ఎక్కువగా పడతాయి. మేము ప్రస్తుతం సంతోషంగా ఉన్నాం. అలాగే పెళ్లి కోసం కూడా ఎదురు చూస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చింది.

తన రిలేషన్షిప్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. సినిమా ఇండస్ట్రీలో ఒకే మనస్తత్వం గల వారు దొరకడం చాలా అరుదుగా ఉంటుందని ఆమె తెలిపారు. 'ఫక్రీ' సినిమా షూటింగ్ లో కలుసుకున్న ఈ జంట 2017 వెనిస్ లోని ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా రిచా చద్దా.. కంగనా నటించిన 'పంగా' సినిమాలో ఓ పాత్రలో నటించింది. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.