వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నిత్యం ఏదో రకమైన కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఫలితంగా వివాదాలు చుట్టముట్టడం.. వాటిని కవర్ చేసుకోవడానికి ఆర్జీవీ తన మాటలకు పదును పెట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. 

తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తూ ప్రభుత్వాలు  మద్యం విక్రయాలకు అనుమతి నిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మద్యం దుకాణాల ఎదుట మందుబాబులు బారులు తీరుతున్నారు. దాదాపు నెలరోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. 

కొన్ని ప్రాంతాల్లో మహిళలు కూడా వైన్ షాపుల వద్ద క్యూలో ఉన్న ఫోటోని వర్మ ట్విట్టర్ లో షేర్ చేశాడు. తాగుబోతుల నుంచి మహిళలని కాపాడాలని అందరూ అంటుంటారు.. కానీ ఇక్కడ చూడండి వైన్ షాపుల వద్ద క్యూలో ఎవరున్నారో అని వర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 

అమ్మా నాన్న విడిపోయి మంచి పని చేశారు.. కళ్లారా చూశా.. శృతి హాసన్

వర్మ చేసిన ఈ ట్వీట్ దుమారంగా మారింది. ప్రముఖ ఫీమేల్ సింగర్ సోనా మెహపాత్ర వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డియర్ ఆర్జీవీ నీకు గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయం. నీవు చేసిన ట్వీట్ సెక్సిజంని ప్రేరేపించేలా ఉంది. నీవు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పురుషులతో పాటు మహిళలకు కూడా మద్యం కొనుక్కుని తాగే హక్కుంది. కానీ తాగి హింస చేసే హక్కు ఎవరికీ లేదు అని సోనా తెలిపింది. 

స్టాటిస్టిక్స్ ప్రకారం మద్యం సేవించి హింసచేసే వారిలో పురుషులే ఎక్కువ. మహిళలు హింస చేసే సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.