కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో పరాజయాలు ఎదురైనప్పటికి.. ఆ తర్వాత గబ్బర్ సింగ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. 

తెలుగులో కాటమరాయుడు చిత్రం తర్వాత శృతి హాసన్ కొంత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం మళ్ళీ సినిమాలతో బిజీగా మారింది. శృతి హాసన్ తల్లి దండ్రులు కమల్ హాసన్, సారిక చాలా కాలం క్రితమే విభేదాలతో విడిపోయారు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

శృతి హాసన్ మాట్లాడుతూ.. మా అమ్మా నాన్న విడిపోవడమే మంచిది అయింది. ప్రస్తుతం వారిద్దరూ మనశాంతిగా జీవిస్తున్నారు. విభేదాలు వచ్చినప్పుడు కలసి జీవించడం కంటే విడిపోవడమే బెటర్. కలసి ఉన్నప్పుడు వారిద్దరూ సంతోషంగా లేదు. కలసి ఉన్నప్పుడు వారి మధ్య ఎన్నో సమస్యలు తలెత్తాయి. నేను కళ్లారా చూశా. 

విడిపోయాక ఎవరి జీవితాన్ని వారు ప్రశాంతంగా గడుపుతున్నారు. ఆరంభంలో అమ్మ నాన్న కలసి ఉంటే బావుండేదని నేను కూడా అనుకున్నా. కానీ వారిద్దరూ విడిపోవడమే బటర్ అని శృతి హాసన్ తెలిపింది.