సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి మొదలైన వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా టైటిల్ మాత్రమే కాకుండా కథ మొత్తం ఏపీ ప్రస్తుతం రాజకీయాల మాదిరి ఉందని సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో చాలా పిటిషన్లు వేశారు. సినిమా రిలీజ్ ని ఆపాలని కోర్టుని కోరారు. సెన్సార్ కార్యక్రమాలు జరకపోవడంతో సినిమా వాయిదా పడింది. ఎట్టకేలకు కొన్ని కట్స్ తో రివైజింగ్ కమిటీ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది.

ప్రేమ పెళ్లి.. ఏడాది తిరగకుండానే.. హీరోయిన్ విడాకులు

అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా వివాదంలో ఇరుక్కుంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదల ఆపాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సినిమాలో అభ్యంతర సన్నివేశాలను తొలగించలేదని పిటిషనర్ అన్నారు.

ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో విచారణ జరపనున్నారు. ఈ సినిమా టైటిల్ ని మార్చి 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే టైటిల్ తో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.