షాపులు వాళ్లు అన్ సీజన్ లో తమ సేల్స్ పెంచుకోవటం కోసం 'వన్ ప్లస్ వన్' ఆఫర్ ని ప్రకటిస్తూంటారు. అంటే తమ షాపులో ఒకటి కొంటే మరొకటి ఫ్రీ ఇస్తారన్నమాట. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం అలాంటి ఆఫర్ ని తన తాజా చిత్రాల బిజినెస్ కు అప్లై చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ వార్త నిజమే అయితే సినిమా బిజినెస్ లో ఇదొక కొత్త ఆవిష్కారమే. ఇలాంటి కొత్త ట్రిక్ లు గతంలోనూ వర్మ తన సినిమాల బిజినెస్ రూపంలో ట్రై చేసి ఉన్నారు.

ఇంతకీ వర్మ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పబడుతున్న సినిమాలు రెండూ ఏమిటీ అంటే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, బ్యూటిఫుల్. కొద్దో గొప్పో క్రేజ్ వచ్చింది కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రానికి. అయితే ఈ సినిమాకు సెన్సార్ ట్విస్ట్ ఇవ్వటంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యిపోయింది. రివైజింగ్ కమిటి వారు ఈ సినిమాకు అనేక కట్స్ చెప్తున్నట్లు వినికిడి. అదే కనుక జరిగి, సెన్సార్ ఇస్తే సినిమా లో చూడటానికి ఏమీ ఉండదు.

చట్టాన్ని చేతుల్లోకి.. పోలీసులపై యాక్షన్ తీసుకోండి.. హీరోయిన్ కామెంట్స్!

కాంట్రవర్శి మూవీ కాబట్టి ఓపినింగ్స్ బాగున్నా..మార్నింగ్ షో కే విషయం లేదని టాక్ వస్తే ఇంతే సంగతలు. గతంలో అనేక సార్లు సెన్సార్ వద్ద ఆగిన సినిమాలకు ఈ పరిస్దితి ఎదురైంది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఉత్సాహంగా ఈ సినిమాని తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. అలాగే చివరి నిముషంలో సినిమాకు ఏదైనా ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చనే భయం కూడా ఉంది.

ఈ నేపధ్యంలో సినిమాకు బిజినెస్ ఒక్కసారిగా ఆగిపోవటంతో..వర్మ ఈ సినిమాకు తోడుగా బ్యూటీఫుల్ ని సైతం దింపారు. బ్యూటీఫుల్ సినిమా సైతం బిజినెస్ కావటం లేదని వినికిడి. ఎప్పుడో పూర్తైన ఈ సినిమా అలాగే హార్డ్ డిస్క్ లో మగ్గుతోంది. రీసెంట్ గా వదిలిన ప్రమోషన్ మెటీరియల్ కూడా సినిమాపై క్రేజ్ తేలేకపోయింది. దానికి బిజినెస్ అయ్యే పరిస్దితి లేదు.

దానికి తోడు ఆ సినిమాకు ఓపినింగ్స్ సైతం కష్టమే. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే వర్మ...కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీసుకున్న వాళ్లకు బ్యూటీఫుల్ సినిమా ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు ట్రేడ్ లో వినపడుతోంది. మరి ఇఫ్పటికైనా డిస్ట్రిబ్యూటర్స్ లో కదలిక వస్తుందేమో చూడాలి.