దిశ కేసులో నిందితులని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటనపై సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ఎన్ కౌంటర్ పై సినీ రాజకీయ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నిందితుల్ని ఎన్ ఎన్ కౌంటర్ చేయడం ద్వారా దిశకు పోలీసులు సరైన న్యాయం చేశారని అంతా ప్రశంసిస్తున్నారు. అలాంటప్పుడు ఈ హీరోయిన్ ఎవరు..  పోలీసులని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తోంది అనే అనుమానం కలగక మానదు. తమిళ నటి కస్తూరి ఎన్ కౌంటర్ ఘటనపై ట్విట్టర్ లో స్పందించింది. కానీ ఆమె తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయలేదు. 

అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

పరోక్షంగా పోలీసులని అభినందిస్తూ ట్వీట్ చేసింది. 'హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. దిశ కేసులో నిందితులని ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులపై ఖఠినమైన చర్యలు తీసుకోవాలి.. వారిని వెంటనే ఉత్తరప్రదేశ్ లోని 'ఉన్నావ్', తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతాలకు బదిలీ చేయాలి' అని  కస్తూరి ట్వీట్ చేసింది. 

హైదరాబాద్ తో పాటు ఉన్నావ్, పొల్లాచ్చి ప్రాంతాల్లో కూడా అత్యాచార సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ [పోలీసులు మంచి పని చేశారని.. వారిని ఉన్నావ్, పొల్లాచ్చి ప్రాంతాలకు బదిలీ చేస్తే బాధితులకు న్యాయం చేస్తారని అర్థం వచ్చేలా కస్తూరి పరోక్షంగా తెలిపారు. 

తెలుగులో కస్తూరి నాగార్జున సరసన అన్నమయ్య చిత్రంలో హీరోయిన్ గా నటించారు.