వివాదాస్పద దర్శకుడు వర్మకు ఎవరో ఒకరిని కెలకనిదే నిద్ర పట్టదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి ఉంటాడు. దీనితో తన సోషల్ మీడియాతో టైం పాస్ చేస్తున్నాడు. వర్మ తాజాగా మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ లని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. 

గత ఏడాది చివర్లో వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లని పరోక్షంగా టార్గెట్ చేసిన చిత్రం ఇది. కానీ వారి పేర్లు ఉపయోగించకుండా వర్మ మ్యానేజ్ చేశాడు. ఈ చిత్రం గురించి ప్రశ్నిస్తే అది చంద్రబాబు, లోకేష్ లని ఉద్దేశించి కాదని.. వారిని పోలిన విధంగా ఉన్నారు కాబట్టి పొరపడుతున్నారని వర్మ తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నాడు. 

కరోనా ఎఫెక్ట్: సీరియల్స్ బంద్.. బుల్లితెరపై ఇక సినిమాలు మాత్రమే!

ఈ చిత్రంలో లోకేష్ ని పోలి ఉండే పాత్రతో కించపరిచే విధంగా వర్మ సన్నివేవాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ చంద్రబాబు, లోకేష్ లని రిక్వస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. 

మీరెలాగూ క్వారంటైన్ లోనే ఉన్నారు కాబట్టి అమెజాన్  ప్రైమ్ లో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా చూడండి.. చూసి సినిమా ఉందో చెప్పండి అని వర్మ బాబు, లోకేష్ ని రిక్వస్ట్ చేశాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం సృష్టించిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు.