Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: సీరియల్స్ బంద్.. బుల్లితెరపై ఇక సినిమాలు మాత్రమే!

మహమ్మారి కరోనా మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల కడుపు కూడా కొడుతోంది. చైనా పుట్టుకొచ్చిన ఈ రాకాసి ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తోంది.

Corona effect.. Tv serials streaming will going to stopped
Author
Hyderabad, First Published Mar 29, 2020, 5:39 PM IST

మహమ్మారి కరోనా మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల కడుపు కూడా కొడుతోంది. చైనా పుట్టుకొచ్చిన ఈ రాకాసి ప్రస్తుతం ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఇండియాలో కూడా కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 

అన్ని రంగాలని ప్రభావితం చేసిన కరోనా సినిమా రంగాన్ని కూడా కోలుకొని విధంగా దెబ్బ తీస్తోంది. ఇప్పటికే కరోనా ప్రభావంతో అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. టివి సీరియల్స్ షూటింగ్స్ కూడా నిలిపేశారు. దీనితో నటీనటులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టివి సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోవడంతో బుల్లితెరపై సీరియల్స్ ప్రసారాలు ఆగిపోనున్నాయి. 

కరోనా ఎఫెక్ట్.. భార్య చెప్పిందని అలీ ఏం చేస్తున్నాడో చూశారా!

దీనితో ఛానల్ యాజమాన్యాలు ఇకపై సినిమాలనే ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో పాత సీరియల్స్ ని రిపీట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంట్లో ఉండే గృహిణులకు, మహిళలకు ఎక్కువ కాలక్షేపం సీరియల్స్ తోనే. ఆ సీరియల్ ప్రసారాలు ఆగిపోనుండడం వారికి చేదు వార్తే. కరోనా ప్రభావం తగ్గి, షూటింగ్ తిరిగి ప్రారంభమైతేనే బుల్లితెరపై సీరియల్స్ ప్రసారం సాధ్యం అవుతుంది. 

కరోనా వైరస్ జన జీవితాలని పూర్తిగా స్తంభింపజేసి విధంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కరోనా అదుపులోకి రావడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios