లాభాలు రాకపోయినా చివరకు సినిమాకు పెట్టిన డబ్బు వెనక్కి తిరిగి రాకపోయినా ఫర్వాలేదు..కానీ ఈ కోర్ట్ కేసులేంటి...మీడియావాళ్ల అడిగే ప్రశ్నలేంటి...ఎందుకు నాకీ తలనొప్పి..డబ్బు ఎదురు ఇచ్చి మరీ కొట్టించుకున్నట్లు  అయ్యింది నా పరిస్దితి అని వాపోతున్నాడట..`అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` నిర్మాత. సినిమా రిలీజ్ కు ముందు ఏదో చిన్న చిన్న కాంట్రావర్శీ లు ఉంటాయి కానీ మరీ ఇంతలా వర్మ రెచ్చగొట్టి మరీ గొడవలు తెస్తాడనుకోలేదు అని బాధపడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో  వినిపిస్తోంది. తెలిసి తెలిసీ వర్మతో సినిమా చేసిన ఆయన్ను చూసి జాలి పడుతున్నారట ఆయన ఫ్రెండ్స్.

అనేక వివాదాలు, విమర్శలు, హంగామా అనంతరం  ఆర్జీవీ `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` థియేట‌ర్ల‌లో రిలీజైన సంగతి తెలిసిందే.  అయితే రిలీజ్ అవుతుందో లేదో తెలియని టైమ్ లో... లాస్ట్ మినిట్ లో సెన్సార్ పూర్తి చేసి హడావిడిగా రిలీజ్ పెట్టారు. దాంతో చాలా మందికి ఈ సినిమా విడుదల అయ్యిందనే విషయమే తెలియలేదు. దానికి తగినట్లు సినిమా కంటెంట్ కూడా బాగా పూర్ గా ఉండటంతో వర్కవుట్ కాలేదు. ఓపినింగ్ రోజు సాయింత్రానికే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. అయితే రామ్ గోపాల్ వర్మ  ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ వచ్చిందన్నారు.

ఈ హిట్టు సినిమాల్లో ఈ హీరోలకు ఏం నచ్చేలోదో?

అయితే  ఫస్ట్ డే కలెక్షన్లు కూడా కుమ్మేసాయని చిత్ర యూనిట్ చెపుతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సినిమా వందకి వెయ్యి శాతం బ్లాక్ బస్టర్ హిట్టు అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘తొలిరోజు కలెక్షన్లు గర్జిస్తున్నాయి. కల్పిత సన్నివేశాల్లో రియల్ క్యారెక్టర్స్‌పై కల్పిత పాత్రలతో తెరకెక్కించిన ఈ కొత్త జోనర్ సినిమాను ప్రజలు బాగా ఆదరించారని దీనిని బట్టే అర్థమవుతోంది’ అంటూ రిలీజ్ ట్రైలర్స్ వీడియోను విడుదల చేశారు.

 ఇది విన్న ట్రేడ్ విశ్లేషకులు..ఏ ఏరియాలో కలెక్షన్స్ వచ్చాయో చెప్పమని నిర్మాతని ఛాలెంజ్ చేస్తున్నారు. మరో ప్రక్క రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా సినిమాపై కేసులు తగ్గటం లేదు. అనేకమైన లీగల్ ఇష్యూలతో రోజూ లాయిర్స్  తో నిర్మాత గడుపుతున్నట్లు చెప్తున్నారు.
 
ఇక వర్మ చేసిన  ప్ర‌చారార్భాటం చూసి ఏదో మ్యాజిక్ చేస్తాడ‌ని ఆశించిన వారికి పూర్తి స్దాయి నిరాశే ఎదురైంది.దాంతో చూసిన కొద్ది మందీ కూడా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయటం మొదలెట్టారు. ఇక రివ్యూలు అయితే అతి దారుణంగా వచ్చాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కలెక్షన్స్ మార్నింగ్ షోకు  ఉన్నవి..మ్యాట్నీకు తగ్గితే, ఫస్ట్ షో,సెకండ్ షోలకు మరీ షాకిచ్చే స్దాయికి పడిపోయాయని ట్రేడ్ వర్గాల సమాచారం.