బుల్లితెరపై నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. దీనికి పోటీగా ఎన్ని షోలు వస్తున్నా.. నిలబడలేకపోతున్నాయి. ఆడియన్స్ ని నవ్విస్తూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ షోపై అప్పుడప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ షోలో కొన్ని స్కిట్ లను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

రీసెంట్ గా హైపర్ ఆది చేసిన ఓ స్కిట్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 'జబర్దస్త్' షోలో హైపర్ ఆది పెర్ఫార్మన్స్ కోసం ఆడియన్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ఆది పంచ్ డైలాగ్స్, అతడు వేసే కౌంటర్లకు పడి పడి నవ్వుతుంటారు. అయితే ఇటీవల జరిగిన ఓ షోలో హైపర్ ఆది వేసిన ఓ స్కిట్ చూసిన నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు.

మెగాస్టార్, ఎన్టీఆర్ ఒకే వేదికపై..?

ఇప్పటికే తన స్కిట్ ల ద్వారా పలు సందర్భాల్లో వివాదాల్లో నిలిచిన హైపర్ ఆది మరోసారి తన స్కిట్ కారణంగా వార్తల్లో నిలిచాడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఎద్దేవా చేస్తున్నట్లు హైపర్ ఆది వేసిన స్కిట్ ఇప్పుడు సంచలనాలకు దారితీసింది. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా ఆధారంగా ఓ స్కిట్ చేశాడు హైపర్ ఆది.

ఈ స్కిట్ లో రాఘవేంద్రరావు క్యారెక్టర్ తో పాటు, రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ చేస్తూ స్కిట్ చేశారు. ఇందులో వర్మ క్యారెక్టర్ పై సెటైర్లు వేస్తూ నవ్వించాడు హైపర్ ఆది. ఈక్రమంలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేశాడు. ఈ విషయం వర్మ అభిమానులకు నచ్చలేదు. దీంతో వారు హైపర్ ఆదిపై విరుచుకుపడుతున్నారు.

వర్మ లాంటి సీనియర్ డైరెక్టర్ మీద సెటైర్లు వేయడానికి నీ స్థాయి ఎంత..? అంటూ ఆదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆదికి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది!