సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  'మహర్షి' తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ కి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 5న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 

'ప్రతిరోజూ పండగే' ట్విట్టర్ రివ్యూ!

ఈ ఈవెంట్ కి కాంబినేషన్ గెస్ట్ లు సెట్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మహేష్ బాబుతో పాటు వేదికను మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పంచుకోనున్నారని సమాచారం. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సముఖత వ్యక్తం చేశారు. ఆయన రావడం పక్కా అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాల్సివుంది. మరోపక్క త్రివిక్రమ్ తన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఫంక్షన్ కి ఎన్టీఆర్ ని రమ్మని అడుగుతున్నారు.

ఈవెంట్స్ రెండు ఒకేరోజు కావడంతో ఎన్టీఆర్ దేనికి వెళ్తారనేది సందేహంగా మారింది. ఈ విషయంపై శనివారం నాటికి క్లారిటీ రానుంది. ఒకవేళ ఎన్టీఆర్ గనుక 'సరిలేరు నీకెవ్వరు' ఫంక్షన్ కి వెళితే.. 'అల.. వైకుంఠపురములో' చిత్రబృందం డిఫెన్స్ లో పడిపోతుంది. మరేం జరుగుతుందో చూడాలి!